A short Tribute to the Soldiers- by MasterMyend.

జోరు వాన ఇద్దరిని ఒక చోట చేర్చింది.
గాయమైన తన భుజముని చూచి ,
చేతిన ఉన్న తుపాకీని చూచి ,
ఆగబట్ట లేక ఆడిగేసినా తనను.

ఏ కుల రక్తం నీది,ఏ మత బంధం నీది?
దేహం అంటే ప్రేమ లేదా, బంధం అంటే ప్రీతి లేదా?
నిదుర మీద మోజు లేదా,ఐశ్వర్యం మీద ఆశ లేదా?
విద్య అంటలేదా,పూట గడవలేదా?

మబ్బునై నేను ఇలా ప్రశ్నలు వర్షిస్తుండగా,...
ముఖము మీద చిరునవ్వుతో,గంభీరమైన కంఠంతో
భూదేవి వంటి ఓర్పుతో,తన తల పైకి ఎత్తి నా కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు....

కులాలు పేర్లు చెప్పి కల్లోలాలుకు కారణం కాను
మతాలు పేర్లు చెప్పి సమాజంలో మంటలు రేపను
దేహాన్ని  దేశం కోసం అర్పిస్తాను
దేశబంధునై బంధాన్ని విడిచిపెట్టి నడిచాను.
నిదురపై మోజు లేదు శత్రువు అంటే బెదురు లేదు.
ఐశ్వర్యం మీద ఆశ లేదు ఆకలి మీద ధ్యాసలేదు.
గురి తప్పని బాణాన్ని,దేశ భధ్రతకై పాకులాడే సైనికుడుని.


అతని మాటలు తూటాలు లాగా నన్ను తాకగా
నా మనసుకి ,మెదడుకి పట్టిన  తుప్పు నన్ను విడిచిపోగా

అనుకున్న నాలో నేను వందలసార్లు
ఎంత వ్యత్యాసము కుటుంబం కోసం కష్టం చేసే నేను ఒక వైపు ,
దేశం కోసం పరితపించే ఆ యువకుడు ఒక వైపు.
సిగ్గుతో తలదించుకున్నాను.
కులం విడిచి ,మతం మరిచి ఆ యువకుడిలో నా కొడుకుని చూసుకొని గర్వించాను!

జైహింద్!!

Comments